గల్ఫ్ కార్మికుల కష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. త్వరలోనే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్


 

గల్ఫ్ కార్మికుల కష్టాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారి ద్వారా మాత్రమే కార్మికులు ఆయా దేశాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. 

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 15 లక్షల కుటుంబాలు గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని.. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. 

Also Read : దూసుకెళ్తోన్న " వందే భారత్‌‌ ఎక్స్‌ప్రెస్ " .. ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణం ..!!

గల్ఫ్ కార్మికుల కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయా దేశాలు, రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామని.. ఉపాధి కోసం వెళ్లినవారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన తెలిపారు. ఓవర్సీస్ కార్మికుల కోసం పిలిప్పీన్స్, మనదేశంలోని కేరళలో మంచి విధానాలు అమల్లో వున్నాయని.. గల్ఫ్ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్లుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 





Comments